మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు కిందకు దిగుతున్నాయి. రుతుపవనాల రాకతో రాష్ట్ర మంతటా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో కూరగాయ పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గత వారం రోజులుగా అన్ని రకాల కూరగాయల ధరలు క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి టామాటా ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నాయి. గత వారం పదిరోజుల కిందట కిలో టమాటా ధర 80రూపాయలు పలికింది. మే నెలలో ఎండలు మండి పోవటం, పంటలు దెబ్బతినడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట దిగుబడి తగ్గిపోటం తదితర కారణాల వల్ల టామాటా ధరలు చుక్కులు చూపించాయి. రాష్ట్రంలో తగినంత పంట ఉత్పత్తి లేకపోవటంతో పోరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, అంధప్రదేశ్ రాష్ట్రాల నుంచి టామాటా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. పెరిగిన ఇంధన ధరలతో రవాణా చార్జీలు కూడా జత కలవటంతో టామాటా ధర కిలో రూ.60నుంచి 80రూపాయల మధ్యలో కొనసాగుతూ వచ్చింది. వంటల్లో నిత్యావసరంగా మారి సామాన్యపేద మద్యతరగతి ప్రజలకు టమాటా ధర మరింత పులుపెక్కుతూ వచ్చింది. ఎండలకు దెబ్బతిన్న పంటలు అడపా దడపా కరుస్తున్న వర్షాలతో తిరిగి కోలుకుంటున్నాయి. పంట దిగుబడి కూడా ఆశాజనకంగా మారటంతో మార్కెట్లకు సరుకు రాక పెరిగింది.
దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని, వారం పదిరోజల్లో కిలో ధర 2030సాధారణ పరిస్థితికి చేరుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లు, రైతు బజార్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.కిలో టామాటా రూ.38, పచ్చిమిర్చి రూ.50, బజ్జీ మిర్చి రూ.50, క్యాప్సికం రూ.55, క్యాబేజి రూ.27, క్యాలీప్లవర్ రూ.23, బిన్నీస్ రూ.70, గింజ చిక్కుడు రూ.50, గోకర కాయ రూ.35, దోసకాయ రూ.15, కీరకాయ రూ.55, సొరకాయ రూ.15, బీట్‌రూట్ రూ.24, ఉల్లిగడ్డ రూ. 16, ఆలుగడ్డ రూ.26, చామగడ్డ రూ.40, మొరంగడ్డ రూ.23, కందగడ్డ రూ.23 ముల్లంగి రూ.5, కాయ ధరలు గుమ్మడి కాయ రూ.15, బూడిదగుమ్మడి రూ.13, పొట్లకాయ రూ.18, అరటికాయ రూ.10, మునగకాయ రూ.3, మామిడికాయ రూ.10, నిమ్మాకాయలు డజను రూ.30, అల్లం ఆరకిలో రూ.24, ఎల్లిగడ్డ ఆరకిలో రూ.30 చొప్పున విక్రయాలు జరిగాయి.
Tomato and Onion prices Drops