Sunday, December 22, 2024

ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ,చుక్కలనంటుతున్న టమాటా ధరలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతుంటే..టమాటా రైతులు మాత్రం తమ కష్టాలు కడతేరాయని సంబరపడుతున్నారు. మహారాష్ట్రలో ఒక టమాటా రైతు నెలరోజుల్లోనే రూ. 3 కోట్లు సంసాదించడం ఆ పంటను వేసిన రైతు పంట పండిందనడానికి నిదర్శనం.

మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార తహసిల్‌లోని పచ్‌ఘర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ గాయకర్ అనే 36 ఏళ్ల రైతు కేవలం నెలరోజుల్లోనే 12 ఎకరాల్లో వేసిన టమాటా పంట ద్వారా రూ. 3 కోట్లు సంపాదించాడు.ఈ ఏడాది మే నెలలో ఇదే రైతు గిట్టుబాటు ధర లేక తన టమాటా దిగుబడిని రోడ్డుపాలు చేయడం తమనార్హం. నష్టం వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని ధైర్యంతో అతను 12 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. ఈ ఏడాది ఎండలకు టమాటా పంట చేతికందడం కష్టమని కూడా ఒకదశలో దిగాలుపడ్డాడు. అయినప్పటికీ అతని కష్టం ఫలించింది. జూన్ 11 నుంచి జులై 18 వరకు తన పంటను అమ్మడం ద్వారా అతనికి రూ. 3 కోట్ల రాబడి వచ్చింది.

జున్నార్‌లోని నారాయణగావ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మొత్తం 18,000 క్రేట్ల(ఒక్కో కేట్‌లో 20 కిలోల టమాటాలు ఉంటాయి) టమాటాలు విక్రయించినట్లు ఈశ్వర్ తెలిపాడు. మరో 4,000 క్రేట్ల టమాటా మిగిలి ఉందని, వాటిని అమ్మడం ద్వారా మరో రూ. 50 లక్షలు వస్తాయని అతను తెలిపాడు. రవాణా ఖర్చులతో కలిపి తనకు పంట ఖర్చులు సుమారు రూ. 40లక్షలు వ్యయం అయినట్లు అతను వివరించాడు. జూన్ 11న క్రేట్‌కు రూ. 770(కిలో రూ. 38) చొప్పున తనకు ఆదాయం లభించగా, జులై 18న క్రేట్‌కు రూ. 2,200(కిలో రూ. 110) చొప్పున లభించిందని రైతు తెలిపాడు.

తనకు మొత్తం 18 ఎకరాలు ఉండగా అందులో 12 ఎకరాలలో టమాటా పంట వేసినట్లు అతను చెప్పాడు. గత మే నెలలో ఒక ఎకరంలో టమాటా పంట వేయగా క్రేట్‌కు రూ. 50(కిలో రూ. 2.50) మాత్రమే ధర పలకండంతో పంటనంతా పొలంలోనే వదిలేశానని అతను చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News