తిరువనంతపురం: కేరళలో 80 మంది బాలలకు టమోట ఫ్లూ సంక్రమించింది. ఒకవైపు కరోనా మహమ్మారి భయపెడుతుంటే మరోవైపు ఇప్పుడు కేరళలో బాలలకు టమోట ఫ్లూ వ్యాపిస్తోంది. ఈ వ్యాధి సంక్రమించిన వారంతా 5 ఏళ్ల లోపు బాలలే. కేరళ విజృభిస్తున్న టమోట ఫ్లూతో ఇటు తమిళనాడు, అటు కర్ణాటక అప్రమత్తం అయ్యాయి.
అసలు టమోట ఫ్లూ అంటే ఏమిటి?
టమోట ఫ్లూ అనేది అరుదైన వైరల్ ఫ్లూ. ఇది సంక్రమించాక శరీరంపై ఎర్రని దద్దుర్లు ఏర్పడతాయి. శరీరంలో మంట, డీహైడ్రెన్ సమస్య తలెత్తుతాయి. ఈ వ్యాధి వల్ల శరీరంపై ఏర్పడే దద్దుర్లు ఎర్రగా టమోట వలే ఉంటాయి. అందుకనే దీనికి టమోట ఫ్లూ అన్న పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టమోట ఫ్లూ కేరళలోని పిల్లల్లో మాత్రమే వ్యాపిస్తోంది. ఈ వ్యాధి సంక్రమించిన వారిని వేరుగా ఉంచాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. సంక్రమితులు వాడే వస్తువులను శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.