- Advertisement -
కోయంబత్తూరు: పొరుగు రాష్ట్రం కేరళలోని ఒక జిల్లాలో టమోటా ఫ్లూ వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరులోకి ప్రవేశిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. టమోటా ఫ్లూ లక్షణాలైన జ్వరం, దద్దుర్లు, తదితర అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు 24 మంది సిబ్బందితో ఒక వైద్య బృందాన్ని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమిళనాడు-కేరళ సరిహద్దులోని వలయార్ జిల్లా నుంచి వాహనాలలో కోయంబత్తూరు వస్తున్న ప్రయాణికులు ముఖ్యంగా పిల్లలను పరీక్షిస్తున్నట్లు అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. ఇద్దరు వైద్య అధికారుల సారథ్యంలోని ఈ వైద్య బృందం ఐదేళ్లలోపు పిల్లలను పరీక్షిస్తున్నట్లు వారు తెలిపారు.
- Advertisement -