Monday, December 23, 2024

దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి

- Advertisement -
- Advertisement -

Tomato flu outbreak in India

 

పిల్లలకు సంక్రమణం..పేగుల వైరస్ కారణం

న్యూఢిల్లీ : భారతదేశంలో మరో కొత్త జబ్బు టొమాటో ఫ్లూ తలెత్తింది. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. టొమాట రంగులో కణితల మాదిరిగా ఏర్పడి మనుష్యులను ప్రత్యేకించి పిల్లలను అనారోగ్యం పాలు చేస్తున్న ఈ టొమాటో ఫ్లూ గురించి లాన్సెట్ రిస్పిరేటరీ జర్నల్ ప్రత్యేకంగా వ్యాసం వెలువరించింది. ఈ ఫ్లూ జబ్బుల కేసులు ఇప్పటికైతే కేరళ, ఒడిషాలలో తలెత్తాయి. ముందుగా కేరళలోని కొల్లామ్‌లో మే నెల ఆరవ తేదీన తొలి కేసు నమోదు అయింది. 82 మంది పిల్లలకు సోకింది. ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఫ్లూ పట్టుకుందని వెల్లడించారు. ఇండియాలో ఫోర్త్ వేవ్ కొవిడ్ గురించి ఆందోళనల దశలోనే అది కేరళలోనే తొలిసారిగా ఈ వ్యాధి తలెత్తడం జరిగింది. ఇది అంటువ్యాధి. పేగులలో తలెత్తే వైరస్‌లతో ఈ ఫ్లూ పిల్లలకు ఎక్కువగా వస్తోంది. అయితే పెద్దలలో కూడా అరుదుగా ఈ జబ్బు వస్తోంది. పెద్దలలో రోగనిరోధక శక్తితో తక్కువగా ఈ వ్యాధి బారినపడకుండా ఉంటున్నారు.

టొమాటో పోలిన ఎరుపు కురుపులు పిల్లలకు చాలా బాధాకరంగా మారుతాయి. ఇవి పెరుగుతున్న కొద్ది ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రత్యేకించి తీవ్రజ్వరం, శరీరనొప్పి, కండరాల వాపు, అలసట వంటి చికున్‌గున్యా లక్షణాలే ఎక్కువగా కన్పిస్తాయి. తరువాతి దశల్లో డయోరియా, వాంతులు , నీరసించిపోవడం వంటివి జరుగుతాయి. ఈ ఫ్లూ తమిళనాడు, కర్నాటకలలో కూడా అలర్ట్‌లకు దారితీసింది. ఒడిషాలో 26 మంది పిల్లలకు ఇది సోకిందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఎక్కడా ఈ ఫ్లూ జాడలు ఇప్పటికైతే లేవని లాన్సెట్ తెలిపింది. జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఈ వ్యాధి నుంచి కోలుకునే ఔషధాలు లేవని, అయితే ఇది అత్యధిక స్థాయిలో ఉండే అంటువ్యాధి అని నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News