Thursday, January 23, 2025

టమాట @ 60

- Advertisement -
- Advertisement -

Tomato price hike in Hyderabad

వేసవిలో తగ్గిన టమాట దిగుబడి
మరో నెల రోజులు ఇంతే అంటున్న అధికారులు

హైదరాబాద్: కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. నగరానికి సరఫరా భారీగా తగ్గింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా నేడు ఒక్క సారిగా రూ.38 కి చేరింది. రైతు బజార్లలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే చిల్లర వ్యాపారులు వద్ద కిలో టమాట రూ. 60 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణంగా మండే ఎండలు, భూ గర్భ జలాలు అడుగంటి పోవడమే. దీంతో టమాట దిగుబడి ఒక్క సారిగా తగ్గిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న మెండా మార్కెట్,బోయిపల్లి వంటి హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ ,ఎల్‌బినగర్, వనస్థలిపురం వంటి ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత ఏర్పడింది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టమైందని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.40 నుంచి 45 పలుకుతోంది.

రిటైల్ మార్కెట్లో మాత్రం రూ. 50 నుంచి 60 వరకు వసూలు చేస్తున్నారు. నగరానికి ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దపేట, తదితర జిల్లా నుంచే కాకుండా ఏపీ లోని చిత్తూరు నుంచి కూడా టమాట దిగుమతి అవుతుంటుంది. నగరానికి రోజుకు 45 నుంచి 50 టన్నుల డిమాండ్ ఉండగా ప్రస్తుతం 25 టన్నులు కూడా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కర్నాటక రాజస్థాన్ నుంచి టమాట దిగుబడి వచ్చేది . ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనూ టమాట దిగుబడి తక్కువగా ఉండటంతో నగరానికి సరఫరా తగ్గింది. మార్కెట్‌లో టమాట కొరత దృష్టిలో పెట్టుకుని సూపర్ మార్కెట్,మాల్స్, నిర్వాహకుల మాత్రం పెద్ద మొత్తంలో టమాటను రైతుల నుంచి టోకుగా కొనుగోలు చేస్తు కృత్రిమ కొరత సృష్టిసున్నారు. అసలే దిగుబడి తగ్గి టమాట మార్కెట్ రాక పోవడం ఒక వంతయితే మాల్స్ నిర్వహకులు సృష్టించే కృత్రిమ కొరత కూడా టమాట ధర తగ్గడానికి కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మరో నెల రోజుల పాటు ఉంటుందని మార్కెట్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

tomato price hike in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News