Wednesday, January 22, 2025

రూ.100కు చేరిన టమాటా!

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలకు చేరుకున్నాయి. రైతుబజార్లలో కిలో టమాటా రూ.70కి లభిస్తుండగా, రిటైల్ మార్కెట్లలో తోపుడు బండ్లపైన కిలోకు మరో 20నుంచి30 వరకూ పెంచి కిలో టామాటా రూ.100కు విక్రయిస్తున్నారు. అది కూడా సరుకు నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది.వేసవిలో ఎండల ధాటికి కూరగాయల సాగు పట్ల రైతులు అంతగా మొగ్గు చూపకపోవటం, నీటివనరులు కూడా అడుగంటి పోవటంతో రాష్ట్రంలో కూరగాయ పంటల సాగు భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా కూరగాయ సాగు పంటల ప్రోత్సాహం దిశగా పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టలేకపోయింది. ఈ పంటల సాగుకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించిన దాఖలాలు కూడా లేవని ,

అందుకే తాము సంప్రదాయంగా సాగు చేస్తున్న కూరగాయ పంటలనుంచి ఇతర పంటలకు మళ్లాల్సి వచ్చిందని కొందరు రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు , వరంగల్ , కరీంనగర్ , తదితర పెద్ద నగరాలకు, పట్టణాలకు పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో కూరగాయల సాగును ప్రొత్సహిస్తామని చేసిన ప్రకటనలు కూడా ఆచరణ దిశగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. వాతావరణ పరిస్థితులు ఒక ఎత్తయితే , ప్రభుత్వం కూడా ఉద్యాన పంటల సాగు పట్ల పెద్దగా దృష్టి పెట్టక పోవటం కూడా రాష్ట్రంలో కూరగయ ఉత్పత్తుల సంక్షోభానికి అద్దం పడుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

మరో పదిరోజలు ధరల మంటలే!
రాష్ట్రంలో వేసవి అనంతరం తొలకరి వర్షాలకు సాగు చేసిన కూరగాయ తోటల పంట దిగుబడులు రావాలంటే మరో పదిరోజలు పట్టే అవకాశం ఉందంటున్నారు. ఆకు కూరల ఉత్పత్తి కూడా మరో వారం రోజుల్లో మార్కెట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుత్నున్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాల నుంచే అధికంగా గ్రేటర్ హైదరాబాద్ నగరానికి కూరగాయలు , ఆకు కూరలు దిగుమతి అవుతున్నాయి. అయితే అక్కడ కూడా ధరల మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. టమాటా పంటకు పేరుమోసిన మదనపల్లి, కదరి, రాయచోటి, ఆదోని , ఆలూరు ,కర్నూలు తదితర ప్రాంతాల్లో పంట తగ్గటంతో మార్కెట్‌కు సరుకు రాక తగ్గిపోయింది. ఆ ప్రభావం అక్కడి లోకల్ మార్కెట్లపై కూడా పడింది. ఆయా జిల్లాలనుంని సరుకు అరకొరగా ఇక్కడికి వస్తున్నప్పటికీ రవాణ చార్జీలు తడిసి మోపడవుతున్నాయి.

ఉడుకుతున్న ఉల్లిగడ్డ !
రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు కూడా భారీగా పెరిగాయి. గురువారం రైతుబజార్లలో కూరగాయల ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి. కిలో ఉల్లిగడ్డ ధరలు రూ.30 చేరాయి. టామాటా రూ.71,వంకాయ రూ.35, బెండకాయి రూ.50, పచ్చిమిరప రూ.80, కాలిప్లవర్ రూ.28, కారెట్ రూ.40,బీట్‌రూట్ రూ.23, క్యాబేజి రూ.25, దొండకాయ రూ.45, ఆలుగడ్డ రూ.35, క్లష్టర్ బీన్స్ రూ.55, కంద రూ.55, కీర రూ.35, ఫ్రెంచ్ బీన్స్ రూ.175, చామగడ్డ రూ.35, ఆకు కూరలు కట్ట రూ.20 చోప్పున విక్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News