మన తెలంగాణ/తాండూరు: టమాట ధరలు ఆకస్మాత్తుగా పెరిగాయి. వారం రోజుల్లోనే ఒకటికి రెండింతలు ధరలు పెరగడంతో పేద, మద్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాండూరు డివిజన్ పరిధిలోని తాండూరు పట్టణంలో ప్రతి రోజు కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి. అయితే వారం రోజుల క్రితం కిలో టమాట ధర రూ.40లకు పలికింది. నేడు కిలో టమాట ధర రూ.100కు చేరింది. ఇటీవల కురుసిన వార్షాల కారణంగా టమాట పంట పాడైపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తాండూరు మార్కెట్‌లో ప్రతి రోజు వందలాది క్వింటాళ్ల టమాటలు విక్రయాలు జరుగుతుంటాయి. తాండూరు పట్టణ ప్రజలతోపాటు చుట్టు పక్కల గ్రామీణ ప్రజలు, సిమెంట్ ఫ్యాక్టరీల ఉద్యోగులు, వ్యాపారులు తాండూరులోనే కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. టమాట ధరలు ఆకస్మాత్తుగా పెరగడంతో పేద, మద్య తరగతి ప్రజలు కొనలేని స్థితి ఏర్పడింది. మార్కెట్‌లో కూరగాయ ధరలు పెరగడంతో ఏం కొనాలో ఏం తినాలోనని పేద, మద్య తరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. టమాటతోపాటు ఇతర కూరగాయలు ఏవి కొనుగోలు చేసిన కిలో ధర రూ.40కి తగ్గకుండ ఉన్నాయి.
Tomato price rise to Rs 100 at Tandur Market