- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: టమాటా ధరలు పతనమవుతున్నాయి. ఏపిలో కిలో టమాటా 50పైసలకు దిగజారిపోయింది. నిన్నమొన్నటిదాక కిలో టామాట రూ.5 పలికింది. ఒక్కసారిగా టమాటా ధరలు పడిపోవటంతో రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కనీసం కోతకూలీలు అటుంచి రవాణ చార్జీలు కూడా రావటం లేదు.
దీంతో టమాటాలను రోడ్లపైనే పారబోసి పోతున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో అటుగా వెళుతున్న వాహనదారులకు రోడ్లపక్కన పారబోసిన టమాటా కుప్పులు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. మరోవైపు తెలంగాణలో టమాటా ధరలు కిలో 10రూపాయలకు తగ్గటం లేదు. హైదరాబాద్‌లో కిలో టమాటా 10నుంచి 12రూపాయల ధరతో విక్రయిస్తున్నారు.
Tomato prices decrease in AP
- Advertisement -