Monday, December 23, 2024

రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తున్న టమాటా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధర లేక టమాటా నేలపాలవుతోంది. కిలో 30 పైసలకు కూడా కొనే దిక్కులేక రైతులు విలవిల లాడుతున్నారు. మూడు నెలల పాటు సామాన్యులను ఏడిపించిన టమాటా రేటు… ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నది. మాడు నెలల్లో కిలో టమాటా ధర మూడొందలు పలికింది. ఇవాళా కిలో 30 పైసలకు పడిపోయింది. ప్రస్తుతం టమాటా ధర పూర్తిగా పతనమైంది. అటు కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయం మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ కు తెచ్చిన టమోటాలను అమ్మలేక, తిరిగి తీసుకెళ్లలేక కింద పడవేసి రైతులు వెళ్లిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News