Wednesday, January 22, 2025

దిగొస్తున్న టమోటా ధరలు

- Advertisement -
- Advertisement -

పూణే: నేపాల్ నుండి టమోటాలను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, మార్కెట్‌లో స్థానికుల రాక పెరగడంతో టమోటా ధరలు 50 శాతం తగ్గుదలకి దారితీశాయి. కొద్ది రోజుల క్రితం చకాన్‌లోని ఖేడ్ బజార్ సమితి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో 20 కిలోల టమాటా సగటు ధర రూ.2300 నుంచి 2500 పలుకగా.. శనివారం (12వ తేదీ) ఈ ధర సగానికి పడిపోయింది. రానున్న కాలంలో రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, టమాటా రైతులు అల్లాడిపోతున్నారు.

గత వారం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 నుంచి 120 పలుకుతున్నట్లు చకంలోని వ్యాపారులు తెలిపారు. ఇప్పుడు అవే ధరలు కిలోకు 50 నుంచి 60 రూపాయలకు తగ్గాయి. కొద్దిరోజుల క్రితం ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఖేడ్ బజార్ సమితిలో టమాట రాక 2 నుంచి 4 వేలకు చేరుకోగా మార్కెట్ ధర రూ.2300 నుంచి 2500 పలుకడంతో టమోటా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

హోల్ సేల్ మార్కెట్ కంటే రిటైల్ మార్కెట్ లో టమాటా ధర పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నేపాల్ నుంచి టమాటా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్ కమిటీకి టమాట రాక పెరిగింది. ఈ జంట పరిణామాల కారణంగా శనివారం టమాటా ధరలు భారీగా పడిపోయాయని అడ్టే అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కుమార్ గోర్‌తో సహా అడ్టే, వ్యాపారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News