- Advertisement -
సామాన్యులకు మరోసారి టమాటా షాకిచ్చింది. ఇటీవల భారీగా పెరిగిన టమాటా ధరలు.. కాస్త తగ్గినట్లు తగ్గి మళ్లీ మండిపోతున్నాయి. తాజాగా కిలో టమాటా ధర వందకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో వందపైనే పలుకుతోంది. దీంతో టమాటా కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
సామన్య ప్రజలు కొన్ని రోజులు పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే టమాటాలు భారీగా పెరగటానికి కారణం.. దిగుబడి తగ్గిపోవడమే. ఇప్పటికే మార్కెట్ వచ్చే టమాటాలు సగానికి పైగా తగ్గిపోయాయి. దీంతో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి.కాగా, ఉల్లి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గతంలో కంటే ధరలు ఎక్కువే ఉన్నాయి.
- Advertisement -