మనతెలంగాణ/హైదరాబాద్: టామాటా ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టమాటా అధికంగా పండించే తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పంటను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టామాటాలను సేకరించి అధిక ధరలు ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. దేశరాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సబ్సిడీ ధరలకు వీటిని విక్రయించాలని నిర్ణయించింది.
ఈ నెల 14నుంచి ఈ రాష్ట్రాల్లో రాయితీ టామాటాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్)ద్వారా, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సిసిఎఫ్) ద్వారా దక్షణాది రాష్ట్రాలనుంచి టమాటాలను సేకరించి ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో ఇపుడున్న ధరలకంటే 30శాతం తక్కవకు టమాటాలు విక్రయించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్ంలడించారు.