Thursday, January 23, 2025

ఠారెత్తిస్తున్న టమాటా!…కిలో రూ.150 !!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మార్కెట్‌లో టామాటా ధరలు ఠారెస్తున్నాయి. గత వారం రోజులుగా కూరగాయలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. మొన్నటి దాక కిలో 100రూపాయలు ఉన్న టమాటాలు శనివారం నాటికి రూ.150కి ఏగబాకాయి. దక్షిణాదిలో అతిపెద్ద టమాటా మార్కెట్‌గా ఉన్న మదనపల్లి మార్కెట్‌ట్‌లోనే కిలో టమాటాలు రూ.124 చొప్పున విక్రయాలు జరిగాయి. ఇవి ఇతర ప్రాంతాల మార్కెట్లకు చేరి వినియోదారుల చేతికి చేరేసరికి మధ్యలో దళారుల కమీషన్లు, హమాలీ కూలీ ఖర్చులు, రవాణ చార్జీలు కలిపి తడిసి మోపడవుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న టామాటా ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

పేద, మద్య తరగతి కుటుంబాలు అంతేసి ధరలు పెట్టి టామాటాలు కొనలేక గగ్గోలు పెడుతున్నారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు , తెగుళ్లు , వర్షాకాలం ప్రారంభమైనా నైరుతి రుతుపవనాల రాకలో జాత్యం ,తదితర వాతావరన ప్రతికూలతల నేపధ్యంలో టామాటా పంట దిగుబడి తగ్గిపోయింది. అరకొరగా వస్తున్న దిగుబడి అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో సరుకు ప్రధాన మార్కెట్లకు రావడం కూడా తగ్గిపోయింది. దక్షిణాదిలో ఉత్పత్తి అవుతున్న టామాటా అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమవతి అవుతోంది. దీంతో తెలంగాణతోపాటు ఏపి మార్కెట్లలో పలు చోట్ల టామటా విక్రయాలు అధిక ధరలకు అమ్మేపరిస్థితి లేక చిల్లర వ్యాపారులు వాటిని కొనటం కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్త పంట చేతికొచ్చేదాక టామాటా ధరలు ఇదేవిధంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News