రైతు బజార్లలో కిలో రూ.63
కొత్తపంట రాకతో పాటుగా దిగుబడి పెరగడంతో టమాటా ధరలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. వా రం రోజుల కిందటి వరకూ కిలో టమాట రూ.200 పలికిన టమాటా ధరలు ఈ వారం రోజుల వ్యవధిలోనే వంద రూపాయలకు తగ్గాయి. తాజాగా మంగళవారం రైతుబజార్లలో కిలో టమాటా ధర రూ.63 కు పడిపోయింది. దీంతో ప్రజలు టమాటను కొనేం దుకు పోటీ పడ్డారు.
మనతెలంగాణ/ హైదరాబాద్ : కొత్తపంట రాకతోపాటుగా దిగుబడి పెరగటంతో టా మాటా ధరలు తగ్గుతూ వస్తున్నా యి. గత వారం రోజుల కిందటి వరకూ కిలో రూ. 200 పలికిన టమాటా ధరలు ఈ వారం రో జుల వ్యవధిలోనే వంద రూపాయలకు తగ్గా యి. తాజాగా మంగళవారం రైతుబజార్లలో కిలో టమాటా ధర రూ.63కు తగ్గింది. గ్రేట ర్ హైదరాబాద్ మార్కెట్‌కు అంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ఇరుగు పొరు గు రాష్ట్రాలనుంచి టామాటా దిగుబడి పెరిగింది. రోజుకు 2500 క్విటాళ్ల సరకు ఇక్క డి హోల్‌సేల్ మార్కెట్లకు చేరకుంటోంది. స్థానికంగా కూడ రంగారెడ్డి, మెదక్, వికారబాద్ తదితర ప్రాం తాలనుంచి టామాట దిగుమతి పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈనెల చివరినాటికి టామాటా ధరలు సాధారణ పరిస్థితులకు చే రుకుని వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు మార్కె ట్ వర్గాలు చెబుతున్నాయి.