Saturday, November 23, 2024

రేషన్ షాపులలో రూ. 60కే కిలో టమాట అమ్మకం

- Advertisement -
- Advertisement -

చెన్నై: టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై మహానగరంలోని 82 రేషన్ షాపులలో కిలో టమాట రూ. 60కే మంగళవారం నుండి అందించడం ప్రారంభమైంది.

అవసరమైతే తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కెఆర్ పెరియకుప్పన్ తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, వెల్లూరులో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫార్మ్ ఫ్రెస్ షాపులకు అదనంగా రేషన్ షాపులలో టమాటను సబ్సిడీ ధరలకు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సాయంత్రం సహకార మంత్రి కుప్పన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కిలో టమాట రూ. 60కే రేషన్ షాపులలో విక్రయించాలన్న నిర్ణయం తీసుకున్నారు.

టమాట సాగు అవుతున్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు టమాట నిరాటంకంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట ధర రూ. 110 మేరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News