Sunday, December 22, 2024

జహీరాబాద్ కూరగాయల మార్కెట్‌లో టమాట ట్రేల చోరీ

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాట ట్రేలను దొంగ ఎత్తుకెళ్లారు. ముఖం గుర్తించకుండా హెల్మెట్, జాకెట్ ధరించిన దొంగ రూ. 6500 విలువైన మూడు ట్రేలను దొంగిలించాడు. కమిషన్ ఏజెంట్ దుకాణం నుంచిరైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాట బాక్సులను దుండగుడు ఎత్తుకెళ్తున్న దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కమిషన్ ఏజెంట్ బాదిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News