Sunday, January 19, 2025

టమాటాకు భద్రత..

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్‌ : మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మావల శివారు ప్రాంతాంలో గల జాతీయ రహదారి 44పై శనివారం టమాట లారీ బోల్తా పడింది. రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి టమాటను తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి కింద బోల్తా పడింది. దీంతో లారీల ఉన్న టమాటలన్ని రోడ్డుపై పడి బయటకు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు లారీ బోల్తాపడిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదిలా ఉండగా టమాట ధర ఢిల్లీలో రూ. 300 పలుకుతుండగా ఆదిలాబాద్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు పలుకుతుంది. విలువైనా టమాటలు ఎత్తుకెళ్లడానికి ఒక్కసారిగా జనం తరలిరావడంతో డ్రైవర్‌ అప్రమతమై పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని బందోబస్తు చేశారు. అక్కడ ఉన్న టమాటల కోసం చిక్చనా వాళ్లనందరిని పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. బోల్తాపడిన లారీ కర్ణాటకలోని కొలార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా మార్గ మధ్యలో బోల్తా పడింది. 25 టన్నుల టమాటలు రూ. 22 లక్షల విలువ గల టమాటలను తరలిస్తుండగా బోల్తాపడిందని డ్రైవర్‌ పేర్కొన్నారు. లారీ బోల్తాపడడంతో 50 శాతం టమాట నష్టం వాటిల్లిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన టమాటలను ఢిల్లీకి తరలించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని అక్కడి నుంచి తరలించామని వారు తెలిపారు. లారీలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News