Wednesday, December 25, 2024

మార్కెట్‌కు తరలిస్తుండగా 2 వేల కిలోల టమాటాల చోరీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : మార్కెట్‌లో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో టమాటా చోరీల సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. కర్ణాటకలో ఓరైతు పొలంలో 60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లిన సంఘటన జరగ్గా, తాజాగా మరో చోరీ జరిగింది. బెంగళూరులో మార్కెట్‌కు తరలిస్తున్న టమాటాల వాహనాన్నే కాజేశారు. చిక్కజాల సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగు లోకి వచ్చింది. చిత్రదుర్గ లోని ఓ రైతు కోలార్ మార్కెట్‌కు 2 వేల కిలోల టమాటాలను తరలిస్తుండగా, ముగ్గురు కారులో వెంబడించి అడ్డుకున్నారు.

తమ వాహనాన్ని ఆ రైతు ఢీకొట్టాడని గొడవ పెట్టుకున్నారు. రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి నుంచి ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. తరువాత ఆ రైతును, డ్రైవరును రోడ్డుపై విడిచిపెట్టి టమాటాల వాహనంతో పరారయ్యారు. పోలీసులు రంగం లోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పుడు కిలో టమాటా ధర రూ. 120 నుంచి 150 వరకు పలుకుతోంది. టమాటా దొంగతనాలు పెరుగుతుండడంతో పొలాల వద్దనే టెంట్లు వేసుకుని రైతులు పంట కాపలా కాస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News