Friday, November 22, 2024

రూ. 2.50 లక్షల విలువ చేసే టమాటాల చోరీ

- Advertisement -
- Advertisement -

హళబీడు : ధర బంగారం అయిన టమాటకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. కర్నాటకలోని హళబీడులో ఓ రైతమ్మ తన టమాట పంట పొలంలో దొంగలు పడ్డారని, ఏపుగా కాసిన టమాటలు దోచుకువెళ్లారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 60 కిలోలకు పైగా టమాటలు చోరీ అయ్యాయని వీటి విలువ ఇప్పటి రేటు మేరకు దాదాపు రెండున్నర లక్షల రూపాయల వరకూ ఉంటుందని ఆమె తెలిపింది. పొలంలో ఈ పంటను బ్యాగుల్లో సర్ది ఉంచామని ఎవరో వచ్చి అపహరించుకువెళ్లారని, తనకు న్యాయం దక్కాలని కోరింది. ధరణి అనే ఈ మహిళ ఈ టమాటలను తాము బెంగళూరు మార్కెట్‌కు పంపించేందుకు

సిద్ధం చేశామని అయితే ఇవి కన్పించకుండాపొయ్యాయని గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఈసారి బాగా టమాట పంట కాసిందని , ధర కూడా బాగా ఉందని తెలిసి పొంగిపొయ్యానని, అయితే చోరీతో నీళ్లు చల్లినట్లు అయిందన్నారు. దాదాపు 50 , 60 బ్యాగుల టమాట పోయిందని, ఇప్పుడు తనకు అప్పులు మిగిలినట్లు చెప్పారు. బ్యాగుల్లోని టమాటలను ఎత్తుకెళ్లిన వారు పనిలో పనిగా మిగిలిన టమాట పొలాన్ని ధ్వంసం చేసి వెళ్లారని ఆమె కన్నీటి పర్యంతం అయింది. టమాటలు దోచుకున్నట్లు తమకు ఫిర్యాదు అందడం ఈ ఠాణాలోనే కాదు రాష్ట్రంలోనే ఇది తొలిసారి అని అక్కడి పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News