Monday, December 23, 2024

శవాలను సమాధుల నుంచి బయటకు తీసి అత్యాచారం… సమాధులకు తాళాలు వేసుకుంటున్నారు…

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: కాటికి వెళ్లిన శవాలపై కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. చనిపోయిన తరువాత కూడా మహిళలను కామాంధులు వదలడం లేదు. పూడ్చిపెట్టిన శవాలను బయటకు తీసి వారిపై మృగాళ్లు అత్యాచారం చేస్తుండడంతో సమాధులకు తల్లిదండ్రులు తాళాలు వేసుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. తల్లిదండ్రులు తన కూతుళ్లు చనిపోతే సమాధులకు తాళాలు వేసుకుంటున్నారు. చనిపోయిన తరువాత తన తన కూతుళ్ల పరువు పోతుందని భయపడి సమాధులకు తాళాలు వేసుకుంటున్నారు తల్లిదండ్రులు. 2011లో కరాచీలోని నజీమాబాద్‌లో మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి శ్మశానంలో పని చేస్తాడు. 48 మంది మహిళల శవాలను సమాధులో నుంచి బయటకు తీసి అనంతరం వాటిపై అత్యాచారం చేశాడు. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలు వేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో ప్రతి రెండు గంటలకు మహిళపై అత్యాచారం జరుగుతోంది.

Also read: రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News