దుబాయ్ (యుఎఈ)లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్) కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఇంటర్వూలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని మల్లెపల్లి ఐటిఐ క్యాంపస్‌లో ఈ నెల 20న ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు టామ్‌కామ్ సిఈఓ తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం ఎస్‌ఎస్‌సి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
21-38 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి ఇంటర్వూకు తప్పనిసరిగా౩ పాస్‌పోర్ట్‌లను తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద రిజిస్టర్డ్ అయిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ, టామ్‌కామ్ తెలంగాణా నుండి అర్హత, నైపుణ్యం కలిగిన సెమీస్కిల్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడానికి పనిచేస్తోంది. మరిన్ని వివరాల కోసం టామ్‌కామ్ ఫోన్ 9440050951, 9440049861, 94400 51452 లకు సంప్రదించవచ్చని సూచించారు.