Monday, January 6, 2025

జర్మనిలో ఉద్యోగాలకు టామ్‌కామ్ ఇంటర్వూలు

- Advertisement -
- Advertisement -

జర్మనీలో ఉద్యోగాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) సిఇఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జర్మనీలో యుటిలిటీ వాహనాల(కార్లు), కమర్షియల్ వాహనాల కోసం ఆటోమోటివ్ టెక్నీషియన్‌ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు నెలకు జర్మనీ కరెన్సి 2,800 నుంచి 4 వేల యూరోలు జీతం ఉంటుంది. అభ్యర్థులు మెర్సిడెస్, స్కోడా, హుందాయి, కియా, నిస్సాన్, ఓపెల్, ఫోర్డ్, వోల్వో, వోక్స్‌వ్యాగన్, ఫియట్ వంటి ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్లతో 3 నుండి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని సూచించారు. అదనంగా అభ్యర్థులు మోటార్ వాహన, కమర్షియల్ వాహన మెకాట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అధ్యయనంతో డిప్లొమా కలిగి ఉండాలన్నారు.

ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 20 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. టామ్‌కామ్ అభ్యర్థులకు జర్మన్ భాషా శిక్షణను ఎ1, ఎ2, బి1, బి2 స్థాయిలకు అనుగుణంగా సౌకర్యం కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు టామ్‌కామ్ వెబ్‌సైట్ లేదా, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in ని సందర్శించాలని, లేదా 9440052592, 9440049013, 9440049520, 8125251408 నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు. టామ్ గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరీ, జపాన్, పోలాండ్, రొమేనియా, యుకె వంటి దేశాలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో టామ్‌కామ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News