Thursday, January 23, 2025

26న మహబూబ్‌నగర్ జిల్లాలో టామ్ కామ్ సంస్థ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆగస్టు 26న మహబూబ్‌నగర్ జిల్లాలో టామ్ కామ్ సంస్థ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఈ కింది కళాశాలల్లో నిర్వహించనున్నట్లు టామ్ కామ్ వెల్లడించింది. ఇందులో జిల్లాలోని జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్దనున్న విజయ నర్సింగ్ హోమ్‌లోనూ, అలాగే ఎనుగొండ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలోని జాగృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లోనూ, మహబూబ్‌నగర్ పట్టణంలోని అవంతి హోటల్ పక్కన గల మాతృ భూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లోనూ, క్రిస్టియన్ కాలనీలోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లోనూ, భగీరథ కాలనీ లోని నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లోనూ నిర్వహించనున్నారు.

కాగా 22 నుండి 35 సంవత్సరాల వయస్సు గల నమోదిత కళాశాలల, సంస్థల నుండి డిఎన్‌ఎం డిప్లోమో హెల్డర్లు ఈ నమోదు , అవగాహన కార్యక్రమానికి హాజరు కావచ్చని తెలిపింది. ఎలాంటి ముందస్తు అనుభవం లేని ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని టామ్ కామ్ వెల్లడించింది. మరీ ముఖ్యంగా జపనీస్ భాషపై రెసిడెన్సియల్ శిక్షణ, జపాన్‌లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తి పరమైన నైపుణ్యాలు ఎంపికైన అభ్యర్థులకు టామ్ కామ్ ద్వారా హైదరాబాద్‌లో అందించనున్నారు. విజయవంతంగా స్థానం పొందిన అభ్యర్థులకు సంవత్సరానికి 14 నుండి 16 లక్షల వరకు ఇతర అలవెన్సులతో పాటు సంపాదించవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు టామ్‌కామ్ వెబ్ సైట్ www.tomcom.telangana.gov.in ని సందర్శించవచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News