జపాన్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఈ నెల 13న ఇంటర్వూలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ అయిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సి టామ్‌కామ్ ఇప్పటికే జపాన్‌లో స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కింద పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొదటి, రెండో బ్యాచ్‌లకు చెందిన 32 మంది నర్సులను ఇప్పటికే జపాన్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో టామ్‌కామ్ నియమించింది. వీసా ప్రాసెసింగ్ పూర్తైన తర్వాత మూడో బ్యాచ్ జపాన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆసుపత్రుల్లో చేరనుంది. రాబోయే బ్యాచ్‌లకు అభ్యర్థుల ఎంపిక కోసం టామ్‌కామ్
ఈ నెల 13న విజయనగర్‌లోని ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌లో డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వూలు నిర్వహించనుంది. 1930 సంవత్సరాల వయస్సు గల గుర్తింపు కలిగిన కళాశాలల నుండి తాజా జిఎన్‌ఎం, డిప్లొమా, ఎఎన్‌ఎమ్ పారామెడికల్, ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తు పని అనుభవం అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ, జపాన్‌లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్య శిక్ష అందిచబడుతాయి. నర్సు పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.1.50 లక్షల నుండి 1.80 లక్షల వరకు సంపాదించవచ్చు. మరింత సమాచారం కోసం ఫోన్ 9704570248, 94400520819, 9573945684 నంబర్‌లకు సంప్రదించవచ్చని టామ్‌కామ్ సూచించింది.