- Advertisement -
హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరుకానున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో ఇప్పటికే విడుదల చేసిన అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ నటీమణులు ఈ చిత్రంలో నటించారు.
- Advertisement -