Wednesday, January 22, 2025

రేపు బక్రీద్ (ఈదుల్ అదా)…నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపు ముస్లింల పండుగ ‘బక్రీద్’(ఈదుల్ అదా). ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ ప్రార్థనలు జరిగే చోట వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.

మీరా ఆలం ఈద్గా ప్రాంతంలో రేపు ఉదయం 8.00 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తారు. ఆ సమయంలో పురానా పూల్, కామాటిపురా, కిషన్ బాగ్ నుంచి ఈద్గా వైపు ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రార్థనల కోసం వచ్చే వారి వాహనాల పార్కింగ్ ను నెహ్రూ జూ పార్క్ వద్దనున్న మసీదు వద్ద ఏర్పాటు చేశారు.

పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తారు. దాదాపు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News