- Advertisement -
హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు సర్కార్ సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా సెప్టెంబర్ 12తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
- Advertisement -