Thursday, January 9, 2025

రేపటి నుంచి బిడిఎస్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

Tomorrow Initiation of web counseling for replacement of BDS seats

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బిడిఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 8వ తేదీ సాయింత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి చేయాల్సి ఉంటుంది. ఈ విడతతో పాటు మిగిలిన విడతల కౌన్సిలింగ్‌లకు కూడా ఈ ఆప్షన్ల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో తప్పని సరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https:/tsbdsadm.tsche.in, www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్ లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News