Monday, January 20, 2025

అందరి కళ్లు సానియాపైనే

- Advertisement -
- Advertisement -

కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడుతున్న భారత స్టార్ సానియా మీర్జాపై అందరి దృష్టి నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా ఏకంగా ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది. శనివారం జరిగే తుది పోరులో సానియా జోడీ బ్రెజిల్‌కు చెందిన స్టెఫానిమాటోస్ జంటతో తలపడనుంది. ఇదిలావుంటే సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు సానియా స్పష్టం చేసింది. ఇక కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సానియా టైటిల్‌ను సాధించాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News