Saturday, November 23, 2024

పంజాబ్, కోల్‌కతాలకు సవాల్

- Advertisement -
- Advertisement -

Tomorrow match between PBKS vs KKR

నేడు కీలక మ్యాచ్‌లు, ఓడితే ప్లేఆఫ్ బెర్త్ కష్టమే!

దుబాయి: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్‌లకు కీలకంగా మారాయి. ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే ఇరు జట్లు తాము ఆడే మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. షార్జా వేదికగా జరిగే మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. పంజాబ్ 10 పాయింట్లతో ఉండగా, బెంగళూరు 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చాలెంజర్స్‌తో పోల్చితే పంజాబ్‌కే ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్ రేసుకు దూరం కావడం ఖాయం. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగే రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చావో రేవోగా మారింది. పంజాబ్‌తో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే నైట్‌రైడర్స్ నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఆ జట్టుకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు.

కానీ కోల్‌కతా మాత్రం కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం కోల్‌కతా పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌పై గెలిస్తే కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలహీనంగా ఉన్న హైదరాబాద్‌ను ఓడించడం నైట్‌రైడర్స్‌కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే నిలకడలేమి కోల్‌కతాను వెంటాడుతోంది. ఇక హైదరాబాద్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరం కావడంతో మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక కెప్టెన్ విలియమ్సన్‌కు ఇకపై జరిగే మూడు మ్యాచ్‌లు కూడా సవాల్ వంటివేనని చెప్పాలి. వరుస ఓటముల నేపథ్యంలో విలియమ్సన్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్నర్‌ను తప్పించి కేన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. విలియమ్సన్ కూడా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. ఇక కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్‌ది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. అయితే కేన్‌తో పోల్చితే అతను కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాడు.

గెలిస్తే నాకౌట్ ఖాయం..

మరోవైపు విరాట్ కోహ్లి సేన పంజాబ్‌పై గెలిస్తే నాకౌట్‌కు దూసుకెళుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడినా బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయి. ఇప్పటికే ఏడు విజయాలతో విరాట్ టీమ్ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. అయితే పంజాబ్‌ను ఓడిస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఈ సీజన్‌లో అద్భుత ఆటను కనబరుస్తున్న బెంగళూరును ఓడించడం పంజాబ్‌కు అంత తేలిక కాదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో బెంగళూరు చాలా బలంగా ఉంది. తీంతో ఈ మ్యాచ్‌లోనూ చాలెంజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News