Friday, November 8, 2024

రేపు మిషన్ భగీరథ విజయోత్సవం… రవీంద్రభారతిలో నిర్వహణకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ, విజయోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర స్ధాయిలో రవీంద్ర భారతీలో విజయోత్సవ సభ నిర్వహిస్తారు. ఇందులో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. మిషన్ భగీరథ విజయాలని విశేషంగా తెలియచేస్తారు.

జిల్లా, నియోజవర్గ కేంద్రాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్ధులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. నీళ్లను శుభ్రపర్చుతున్న ప్రక్రియ, ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్న తీరును వివరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన త్రాగునీటి ఇబ్బందులను ప్రస్తావిస్తూ, మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన విధానాన్ని తెలియజేస్తారు.

ప్రతి గ్రామంలో సభ నిర్వహించి గతంలో మంచినీటి కోసం పడ్డ ఇబ్బందులను, బిందెడు నీళ్ల కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిన దుస్థితని ప్రస్తావిస్తారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరిస్తారు. తాగు నీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని ప్రముఖంగా జరిగే మిషన్ భగీరథ విజయోత్సవాలలో వివరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News