Monday, December 2, 2024

సోమవారం రాశి ఫలాలు(02-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడికి కావాల్సిన ధనం చేతికందుతుంది.  రహస్య చర్చలను సాగిస్తారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం –  వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. రహస్య  వ్యూహరచనల అమలు కోసం రహస్య ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యతను ఇస్తారు.

మిథునం – వృత్తి ఉద్యోగాల పరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటకం – ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట కలిగి ఉంటారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి.

సింహం – ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగినది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు కారణాలు ఏమైనాప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి.

కన్య – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి. సంతానపైన దృష్టిని కేంద్రీకరిస్తారు.

తుల –  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మొండి బాకీల వసులుగాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రపు ఫలితాలను ఇస్తాయి.

వృశ్చికం – ఉద్దేశపూర్వకంగానే కొన్ని అవకాశాలను జారవిడుస్తారు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు.

ధనుస్సు – మీ నిర్లక్ష్యం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుంది. తినకుంటే నీరసం తింటే ఆయాసం అన్న విధంగా ఆరోగ్యం చికాకు పెడుతుంది కుటుంబంలో ఇతరుల మితిమీరిన జోగ్యానికి అడ్డుకట్ట వేయగలుగుతారు.

మకరం – ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం కలిసి వస్తుంది. ఇతరుల బాధ్యతలను కూడా మీరే నెత్తిన వేసుకొని కార్యక్రమాలను జరుపుతారు.

కుంభం – మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు.

మీనం – కుటుంబంలో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. నిలకడలేని ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News