Thursday, January 23, 2025

రేపు భారత జాగృతి ‘తెలంగాణ సాహిత్య సభలు’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘తెలంగాణ సాహిత్య సభలు’ నేడు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ సమావేశంలో భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న , నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. నేటి ఉదయం ప్రారంభ సమావేశంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం ఆచార్య డా. ఎన్ గోపికి ప్రధానం చేయనున్నారు. అనంతరం సాహితీ చర్చలు, పత్ర సమర్పణలు. తదితర వివిధ అంశాలపై రోజంతా సమావేశం జరుగనుంది. అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో సభ నిర్వహణ కోసం జాగృతి శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News