Sunday, December 22, 2024

రేగొండలో ఓ వ్యక్తి నాలుక కోసి

- Advertisement -
- Advertisement -

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లిలో బుధవారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలపై గుర్తు తెలియని దుండగులు రాయితో బాది, నాలుక కోసి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మడ్లపల్లి గ్రామంలో గంధం ఓదెలు ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మినరల్ వాటర్ కోసం ద్విచక్రవాహనంపై కోటంచ గ్రామానికి వెళ్లాడు.

వాటర్ క్యాన్ తీసుకొని వస్తుండగా కోటంచ గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు అతడిని పట్టుకున్నారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తలపై రాయితో మోదారు. అనంతరం బ్లేడ్ తో నాలుక కోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఓదేలు రోడ్డు పైకి వచ్చి పడిపోవడంతో స్థానికులు అతడిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఓదేలు మాట్లాడలేకపోతున్నాడు కానీ సైగలతో ముగ్గురు నిందితుల పేర్లను తెలిపాడు. ఓదేలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News