Wednesday, January 22, 2025

నేడు కనిపించనున్న మరో చిట్టి చంద్రుడు !

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక టెలిస్కోప్ లతో ఎవరైనా ‘2024 పిటి5’ ని చూడొచ్చని నిపుణులు అంటున్నారు.

న్యూఢిల్లీ: నేటి రాత్రి కొత్త, తాత్కాలిక చిన్న చంద్రుడు(Mini Moon) ని భూమి పై నుంచి చూడొచ్చు. దీనిని ‘ 2024 పిటి5’ వ్యాసం కేవలం 10 మీటర్లు ఉండనున్నది. ఇది 53 రోజులపాటు భూభ్రమణం చేయనున్నది. తర్వాత అది సౌర వ్యవస్థలోకి తిరిగి వెళ్లిపోతుంది.

దాని పరిమాణం, నమోదు చేయడానికి చాలా చిన్నగా ఉంటుంది… చంద్రుని వ్యాసం 3,476 కిలోమీటర్లు. “2024 PT5” 350,000 రెట్లు చిన్నది, కంటికి కనిపించదు. కానీ ప్రత్యేక టెలిస్కోప్‌లు తెల్లవారుజామున 1.30 తర్వాత దానిని బాగా గుర్తించగలవు. కానీ ఆ సమయానికి ఇండియాలో చాలా మంది గాఢ నిద్రలో ఉంటారు.

ఒక గ్రహం చుట్టూ సహజంగా పరిభ్రమించే దేనినైనా ‘చంద్రుడు’ అంటారు. సహజంగా భ్రమణం చేసే గ్రహాన్ని చంద్రుడు అంటారు. శని గ్రహానికి 146 చంద్రులు, బృహస్పతికి 95 చంద్రులు, అంగారక గ్రహానికి రెండు చంద్రులు, భూమికి కేవలం ఒక చంద్రుడు మాత్రమే ఉన్నారు. శుక్ర గ్రహానికి చెప్పుకోడానికి ఏ చంద్రుడు లేడు. ఇస్రోలో గమనిస్తున్న నిపుణులు ‘2024 పిటి5’ అనే ఈ చంద్రుడు భూమిని ఢీ కొట్టదని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News