Monday, January 20, 2025

భూత్ చిప్స్ ను విడుదల చేసిన టూ యమ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: RP-సంజీవ్ గోయెంకా గ్రూప్ యొక్క FMCG విభాగంలో భాగమైన గిల్ట్‌ఫ్రీ ఇండస్ట్రీస్ కు చెందిన నూతన తరపు స్నాకింగ్ బ్రాండ్ టూ యమ్!, స్నాకింగ్ విభాగంలో కొత్త ఆవిష్కరణలు మరియు అభిరుచిని పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తూ, అస్సలు వదలలేనట్టి, సంతోషకరమైన -టూ యమ్ ! భూత్ చిప్స్ ను విడుదల చేసింది. భారతదేశంలోని అత్యంత ఘాటైన మిరపకాయ, భుత్ జోలోకియాను జోడించుకున్న టూ యమ్! పరిశ్రమ లో మొట్ట మొదటి సారి అన్నట్లుగా అసాధారణమైన భాగస్వామ్యాన్ని చేసుకునే ప్రయత్నం చేసింది.

జిహ్వభిరుచిని ఉర్రూతలూగించే, ఇంద్రియాలను ఉత్తేజపరిచే అసమానమైన స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి భారతదేశం యొక్క అగ్రగామి హాట్ సాస్ బ్రాండ్, నాగిన్‌తో చేతులు కలిపింది.

టూ యమ్!, నాగిన్, నేటి చురుకైన, చైతన్యవంతమైన యువత యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా, ఒక అసాధారణమైన ఉత్పత్తిని రూపొందించడానికి ఏకమయ్యాయి, ఇది తీవ్రమైన ఘాటును కలిగి ఉండటమే కాకుండా ఆశ్చర్యకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది, అందువల్ల దీనిని వదులుకోవడం అసాధ్యం. కేవలం కంటెంట్ పరంగా చేసిన విప్లవాత్మక మార్పులతో సంతృప్తి చెందకుండా, టూ యమ్! భూత్ చిప్స్‌లోని ప్రతి అంశంలో నూతనత్వాన్ని నింపింది. దాని విలక్షణమైన రుచి, ఆకర్షించే ప్యాకేజింగ్ మొదలు దాని ఉత్తేజకరమైన పేరు, సంపూర్ణ డిజిటల్-ఫస్ట్ విధానం వరకు, బ్రాండ్, లీనమయ్యే స్నాకింగ్ అనుభవాన్ని చక్కగా మిళితం చేసింది.

బ్రాండ్ అంబాసిడర్ వరుణ్ ధావన్, ఉరఫ్ మసాలా గురు కూడా తన అనుభవాన్ని తమ అనుసరణీయులతో పంచుకున్నారు. “బయట మండుతున్నది. లోపల కూడా అంతే రీతిలో మండి పోతుంది (కారంగా ఉంది). భూట్ చిప్స్ కా ఝట్కా సచ్ మే యాద్ రహా”. టూ యమ్! చిప్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వరుణ్ ధావన్‌తో పాటు ప్రఖ్యాత భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా కలిశారు. అతను సైతం ఒక రియాక్షన్ వీడియో ద్వారా ఉత్పత్తి పట్ల తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశాడు, “టూ యమ్! భూత్ జోలోకియా చిల్లీస్‌తో మళ్లీ బంగారు పతకం సాధించింది – అసాధారణమైన సృష్టి, భూత్ చిప్స్! ఇది నిజం!! ”

సమగ్ర డిజిటల్-మొదటి వ్యూహాన్ని స్వీకరించడం, టూ యమ్! ఇన్‌ఫ్లుయెన్సర్ భాగస్వామ్యాలు, ఎంగేజింగ్ AR ఫిల్టర్‌లు, శక్తివంతమైన ట్విట్టర్ సంభాషణలు మరియు మరిన్నింటితో సహా – వారి ప్రాధాన్య ఛానెల్‌లలో తమ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి అనేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుంటుంది.

ఈ ఆవిష్కరణ గురించి గిల్ట్‌ఫ్రీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ తివారీ మాట్లాడుతూ, “టూ యమ్! కొత్త యుగం బ్రాండ్‌గా , ఎల్లప్పుడూ నేటి డైనమిక్ యువత అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఈ అభిరుచి, ఈ విభాగం లో వైవిధ్యత తీసుకురావటం తో పాటుగా ఈ వినూత్న రుచిని పుట్టించింది. భూత్ చిప్స్‌తో అద్భుతాన్ని టీమ్ రూపొందించింది, ఒకసారి రుచి చూసిన మీరు దానిని వదిలిపెట్టలేరు. ఈ భూత్ చిప్స్ యొక్క రుచి మరియు మసాలా మిశ్రమం ఖచ్చితంగా ఉంటుంది” అని అన్నారు.

నాగిన్ సహ-వ్యవస్థాపకుడు మైఖేల్ రజనీ మాట్లాడుతూ “నాగిన్‌ వద్ద మా అన్ని ఉత్పత్తులలోనూ ఆవిష్కరణ మరియు వాస్తవికత కీలకంగా ఉన్నాయి. మాతో సమానమైన విలువలను పంచుకునే భారతీయ బ్రాండ్ అయిన టూ యమ్!తో పని చేసే అవకాశం మాకు లభించినప్పుడు, విజయవంతమైన సహకారం అనివార్యమైంది. వారి అద్భుతమైన ఉత్పత్తికి మా ట్విస్ట్ జోడించడం తో అద్భుతమైన భూత్ చిప్స్‌ ఆవిర్భావానికి దారితీసింది!” అని అన్నారు.

ఈ ఉత్పత్తి ఆగస్టు నుండి ట్రేడ్ మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్న SKUలు సాంప్రదాయ వాణిజ్యం కోసం INR 5, 10, 20 లలో లభిస్తే, ప్రత్యేకంగా ఆధునిక వాణిజ్యం, ఇ-కామర్స్ కోసం INR 60 SKU సెప్టెంబర్ విడుదల అవుతుంది. చిరుతిండి ధోరణులను పునర్నిర్వచించటానికి సిద్ధంగా టూ యమ్! యొక్క భూత్ చిప్స్ ఉంది. మసాలా, రుచి, ఆవిష్కరణల యొక్క సామరస్య సమ్మేళనాన్ని ఇది అందిస్తోంది. ఈ సమ్మేళనం నాగిన్ సాస్ రుచి యొక్క ఫియరి సృష్టితో మసాలాను మరింతగా ఆస్వాదిస్తుంది. దాని సాహసోపేతమైన భాగస్వామ్యాలు, అత్యాధునిక విధానం, వినియోగదారుల సంతృప్తికి లొంగని నిబద్ధతతో, టూ యమ్! స్నాకింగ్ విశ్వంలో ట్రయల్‌బ్లేజర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News