Wednesday, January 22, 2025

ఆద్యంతం ఆసక్తికరంగా ‘తుఫాన్’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. ‘తుఫాన్‘ సినిమాను జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నారు. ఆదివారం ‘తుఫాన్’ ట్రైలర్ విడుదల చేశారు.

‘తుఫాన్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్ లో చెప్పారు. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ.. హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలోలేని హీరో గతమేంటి, అతని కోసం పోలీసు వేట ఎందుకు సాగుతోంది. కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News