Sunday, December 22, 2024

తుప్రాన్ లో అగ్ని ప్రమాదం: 8 కార్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

తుప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో కారు షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసి పడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. షార్ట్ సర్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగిందని  అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News