Friday, December 20, 2024

తూప్రాన్ పేటలో రోడ్డు ప్రమాదం… జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

 

తూప్రాన్ పేట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్‌పేట వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్‌పేట శివారులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్‌ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో చౌటుప్పల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో కిలో మీటర్ల పొడవు వాహనాలు స్తంభించాయి. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట నుంచి కోయలగూడెం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో మరోవైపు నుంచి వాహనాలను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News