Thursday, January 23, 2025

టాప్ 10 బెస్ట్ కార్లు

- Advertisement -
- Advertisement -

Top 10 cars sold in February 2022

గత నెలలో మారుతీ కార్ల హవా
ఎక్కువగా విక్రయాలు ఈ కంపెనీకి చెందినవే..

న్యూఢిల్లీ : గత నెలలో చాలా కార్లు సేల్ అవ్వగా, వాటిలో మాత్రం మారుతీ సుజుకీ కార్లు సత్తా చాటాయి. ఎక్కువగా సేల్ అయిన కార్లలో మారుతికి చెందిన ఏడు కార్లు ఉన్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు ఫిబ్రవరికి సంబంధించిన ఆటో విక్రయాల డేటాను విడుదల చేశాయి. ఈ డేటా ప్రకారం, మారుతి స్విఫ్ట్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కారుగా ముందు వరుసలో నిలిచింది. ఆ తర్వాత డిజైర్, వ్యాగన్‌ఆర్ ఉన్నాయి. అదే సమయంలో టాటా మోటార్స్ నెక్సాన్ టాప్-5లో చోటు సంపాదించుకుంది. ఇక హ్యుందాయ్ వెన్యూ, క్రెటా కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. అయితే గత నెలలో కొన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గగా, మరికొన్ని వాహన సేల్స్ పెరిగాయి.

మారుతీ స్విఫ్ట్
మారుతీ సుజుకీ సంస్థకు చెందిన స్విఫ్ట్ కారు 2022 ఫిబ్రవరిలో 19,202 యూనిట్లను విక్రయించింది. ఇది ఫిబ్రవరిలో అమ్మిన 20,264 యూనిట్ల కంటే 5.24 శాతం తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచింది. స్విఫ్ట్ చాలా కాలంగా టాప్-5లో ఉంటోంది. ఈ కారు మెరుగైన పనితీరును కొనసాగిస్తోంది. ఫిబ్రవరిలో మొదటి స్థానంలో నిలిచిన కారు ఇదే.

మారుతీ డిజైర్
రెండో స్థానంలో మారుతీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ఉంది. 2022 ఫిబ్రవరిలో ఈ కారు 17,438 యూనిట్లు సేల్ అయింది. ఇది గత ఫిబ్రవరి కంటే 11,901 యూనిట్లు అంటే 46.52 శాతం ఎక్కువగా ఉంది. ఇది టాప్ 5లోకిఇ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే గత నెలలో ఈ కారు వినియోగదారుల నుండి డిమాండ్‌ను పొందింది. ఈ కారణంగా దాదాపు రెట్టింపు అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.

మారుతి వ్యాగన్‌ఆర్
మారుతి సుజుకీ నుంచి మరో కారు వ్యాగన్‌ఆర్ ఫిబ్రవరిలో 14,669 యూనిట్లను విక్రయించింది. ఇది 2021 ఫిబ్రవరిలో 18,728 యూనిట్ల కంటే 21.67 శాతం తక్కువ సేల్స్‌ను నమోదు చేసింది. కంపెనీ దీనికి కొన్ని అప్‌డేట్‌లను తీసుకువచ్చింది. ఈ మోడల్ రెండు కొత్త ఇంజన్ ఆప్షన్‌లు, కొన్ని కొత్త అప్‌డేట్‌లతో రాబోతోంది. ఆ తర్వాత మళ్లీ నంబర్ వన్‌లోకి రావచ్చు.

మారుతి బాలెనో
మారుతి బాలెనో కొత్త మోడల్ కోసం చాలా మంది వినియోగదారులు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరిలో దీని అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఇది ఫిబ్రవరి 2022లో 12,570 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఫిబ్రవరిలో 20,070 యూనిట్లతో పోలిస్తే 37.36 శాతం క్షీణించాయి. ఇది ప్రారంభించినప్పటి నుండి 25,000 బుకింగ్‌లను పొందింది. ఈ మోడల్ విక్రయాలు వచ్చే నెలలో మెరుగ్గా ఉండవచ్చు.

టాటా నెక్సాన్
ఐదో స్థానంలో టాటా మోటార్స్‌కు చెందిన మోడల్ నెక్సాన్ ఎస్‌యువి నిలిచింది. ఇది 2022 ఫిబ్రవరిలో 12,259 యూనిట్లను సేల్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో విక్రయించిన 7,929 యూనిట్ల కంటే 54.60 శాతం తక్కువ విక్రయాలను నమోదు చేసింది. రెట్టింపు అమ్మకాలతో ఎస్‌యువి టాప్ 5లో స్థానం సంపాదించుకుంది. గత కొన్ని నెలలుగా అలానే కొనసాగుతున్న ఈ మోడల్ నిరంతరంకొత్త అప్‌డేట్‌లతో వస్తోంది.

మారుతీ సుజుకి ఎర్టిగా
మారుతీ ఎర్టిగా, ఈ కారు ఫిబ్రవరిలో 11,649 యూనిట్లు విక్రయించి, ఆరో స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరిలో విక్రయించిన 9,774 యూనిట్లతో పోలిస్తే ఇది 19.18 శాతం పెరిగింది. ఇది నిరంతరం సిఎన్‌జిలో అందుబాటులో ఉండడం వల్ల ప్రయోజనం పొందుతోంది. ఈ కారణంగా టాప్-10లో తన స్థానాన్ని సంపాదించుకోగలుగుతోంది.

మారుతి ఆల్టో
మారుతి సుజుకి చిన్న కారు ఆల్టోకు డిమాండ్ తగ్గుముఖం పడుతోంది. మినీ సెగ్మెంట్‌లో డిమాండ్ తగ్గుతున్న కార్లలో ఇదొకటి. 2022 ఫిబ్రవరిలో 11,551 యూనిట్ల సేల్స్ ఉండగా, 2021 ఫిబ్రవరిలో విక్రయించిన 16,919 యూనిట్లతో పోలిస్తే ఇది 31 శాతం తగ్గింది. గతంలో కంపెనీలో ఈ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. అయితే దీనికి ఇప్పుడు ప్రజాదరణ తగ్గుతోంది.

హుందాయ్ వెన్యూ
హుందాయ్ సంస్థకు చెందిన వెన్యూ మోడల్ అమ్మకాలు కొంతకాలంగా 10,000 మార్కు దిగువకు పడిపోయాయి, అయితే గత నెలలో ఈ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఈ మార్క్‌ను దాటాయి.
హ్యుందాయ్ చిన్న ఎస్‌యువి వెన్యూ 2022 ఫిబ్రవరిలో 10,212 యూనిట్లను విక్రయించింది. 2021 ఫిబ్రవరిలో విక్రయించిన 11,224 యూనిట్లతో పోలిస్తే ఇది 9.01 శాతం తక్కువగా ఉంది.

మారుతి సెలెరియో
మారుతి సెలెరియో అప్‌డేట్‌తో రావడంతో అమ్మకాలు పెరిగాయి. ఈ కారు ఫిబ్రవరిలో 9,896 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో విక్రయించిన 6,214 యూనిట్లతో పోలిస్తే 59.25 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ముందుంది.

హుందాయ్ క్రెటా
హుందాయ్ క్రెటా ఎస్‌యువి విక్రయాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఇది టాప్-10 జాబితాలో నిలిచింది. ఈ మోడల్ ఫిబ్రవరిలో 9,606 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో విక్రయించిన 12,428 యూనిట్ల కంటే 22.70 శాతం తక్కువ విక్రయాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News