Sunday, December 22, 2024

టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..

- Advertisement -
- Advertisement -

ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను నమోదు చేశాయి. మొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికొస్తే, మార్కెట్ విలువ రూ.54,904 కోట్లు పెరిగి రూ.16,77,447 కోట్లకు చేరింది.

ఇక టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,557 కోట్లు పెరిగి రూ.13,59,475 కోట్లకు చేరగా, మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ.13,501 కోట్లు పెరిగి రూ.7,79,948 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.46,283 కోట్లు పెరిగి రూ.8,20,747 కోట్లకు చేరింది. ఇక ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్కెట్ విలువ రూ. 27,978 కోట్లు పెరిగి రూ.4,47,792 కోట్లకు చేరగా, మరో సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ విలువ రూ.29,127 కోట్లు పెరిగి రూ.5,00,174 కోట్లకు పెరిగింది.

హెచ్‌యుఎల్ (హిందుస్తాన్ యువిలివర్) విలువ రూ.1,703 కోట్లు పెరిగి రూ.4,93,907 కోట్లకు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.22,311 కోట్లు పెరిగి రూ.4,22,325 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.33,438 కోట్లు పెరిగి రూ.4,37,859 కోట్లకు చేరింది. టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.15,377 కోట్లు పెరిగి రూ.3,96,963 కోట్లకు చేరింది. టాప్ 10 కంపెనీల ర్యాంకింగ్ చూస్తే, మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్తాన్ యునిలివర్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News