Monday, December 23, 2024

టాప్-10 ఆదర్శ గ్రామాలు తెలంగాణలోనే

- Advertisement -
- Advertisement -

Top 10 ideal villages in Telangana

కేంద్ర పంచాయతీ
రాజ్ శాఖ
వెబ్‌సైట్‌లో
వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ తన వెబ్ సైట్‌లో పేర్కొంది. సన్సద్ ఆ దర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్ సైట్‌లో పె ట్టారు. అంతేకాదు, దేశంలోని మొదటి 20 ఆద ర్శ గ్రామాల్లో 19 గ్రామాలు కూడా మన తెలంగాణవే. ప్రత్యేక తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవాళ్లకు ఇది సూటి సమాధానమని, ఈ అంశాన్ని ప్రస్థావిస్తూ, సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు, ఈ శాఖను చూస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. దీనికి రీ ట్వీట్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదంతా సిఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన ప్రగతి అన్నారు. మొన్ననే వచ్చిన 19 అవార్డులకు ఇది అదనం అని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని టాప్ 10 గ్రామాల వివరాలు

1 యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి (స్కోర్ :92.17)

2. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ (స్కోర్ :91.7)

3. నిజామాబాద్ జిల్లా పల్డా (స్కోర్ 90.95)

4. కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం రామకృష్ణాపూర్ (స్కోర్ 90.94)

5. యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక (స్కోర్ 90.57)

6. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మాల (స్కోర్ :90.49)

7. జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండలం మూల రాంపూర్ (స్కోర్ 90.47)

8. నిజామాబాద్ జిల్లా తానా కుర్దు (స్కోర్ :90.3)

9. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్నూర్ (స్కోర్ 90.28)

10. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి (స్కోర్ 90.25)

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News