Monday, January 20, 2025

టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే…

- Advertisement -
- Advertisement -

Top 5 Electric Scooters in India 2022

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ స్కూటర్లకు నెమ్మదిగా డిమాండ్ పెరుగుతోంది. మే నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను చూస్తే, వీటిలో ఓలా ఎస్1 ప్రో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మోడల్ అత్యధికంగా 9,225 యూనిట్లు సేల్ అయింది. మరోవైపు ఒకినావా ప్రైజ్ ప్రో స్కూటర్ రెండో స్థానంలో ఉంది. అథర్ 450 మూడో స్థానంలో, టివిఎస్ ఐక్యూబ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత చేతక్ స్కూటర్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ప్రో
ఓలా ఎస్1 ప్రో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 181కిమీలు ప్రయాణిస్తుంది. అయితే దాని గరిష్ట వేగం గంటకు 115కి.మీ.గా ఉంది. ఎస్1 ప్రో బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి 6 గంటలు పడుతుంది. ఇందులో మీకు రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. ఎస్1 ప్రో రేంజ్, టాప్ స్పీడ్ ఇతర ఇ-స్కూటర్‌ల కంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఇది ప్రజల మొదటి ఎంపికగా మారింది.

ఒకినావా ప్రైజ్ ప్రో
మేలో ఒకినావా ప్రైజ్ ప్రో అమ్మకాలు దాదాపు 7,339 యూనిట్లు నమోదయ్యాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది రెండో స్థానంలో ఉంది. దీన్ని చార్జ్ చేయడానికి 3 గంటలు మాత్రమే పడుతుంది. దీని వేగవంతమైన చార్జింగ్ ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే దీని పరిధి 85 కి.మీ, ఇది ఓలా ఎస్1 ప్రో కంటే చాలా తక్కువగా ఉంది.

ఏథర్ 450
ఏథర్ 450 మేలో 3,667 యూనిట్లను విక్రయించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. దీని పరిధి 116కి.మీ, గరిష్ట వేగం గంటకు 80కి.మీ.గా ఉంది. ఈ వాహనాన్ని 4 గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఏథర్ తన వినియోగదారులకు జూన్ 30 వరకు ఉచిత చార్జింగ్ సౌకర్యాన్ని అందించింది. ఏథర్ 450లో రివర్స్ ఫీచర్‌ను కూడా పొందుతారు.

టివిఎస్ ఐక్యూబ్
టివిఎస్ ఐక్యూబ్ మే నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. మేలో ఐక్యూబ్ 2,637 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఐక్యూబ్ గరిష్ట వేగం గంటకు 82 కి.మీ, పరిధి 145కి.మీ ఉంది. టివిఎస్ ఈ స్కూటర్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఇచ్చింది. బ్యాటరీ పూర్తిగా టార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది.

చేతక్
చేతక్ మే నెలలో 2544 యూనిట్లను విక్రయించబడింది. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న ఐదో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. చేతక్ పూర్తిగా చార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. దీని పరిధి 90కిమీ, గరిష్ట వేగం గంటకు 70కి.మీగా ఉంది. గత నెలతో పోలిస్తే మేలో చేతక్ విక్రయాలు 85.7 శాతం పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News