Monday, December 23, 2024

అదానీ తరఫున రంగంలోకి టాప్ అమెరికన్ లాయర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమ కంపెనీలను అప్రదిష్టపాల్జేసి ఆర్థికంగా దెబ్బతీసిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్‌పై న్యాయపోరాటానికి గౌతమ్ అదానీ సంసిద్ధులవుతున్నారు. హిండెన్‌బర్గ్‌పై న్యాయపోరాటం కోసం అమెరికాలోని అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ వాచ్‌టెల్‌ను అదానీ హైర్ చేసుకున్నారు. తమ సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా అదానీ గ్రూపు అమెరికాలో అగ్రశ్రేణి న్యాయ సేవా సంస్థ వాచ్‌టెల్‌ను తమ తరఫున వాదించడానికి కుదుర్చుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

వాచ్‌టెల్‌కు చెందిన సీనియర్ న్యాయవాదులు లిప్టన్, రోసెన్, కాట్జ్ హిండెన్‌బర్గ్ నివేదికపై కోర్టులో సవాలు చేయనున్నారు. అదానీ గ్రూపు తరఫున పిటిషన్ దాఖలు చేయనున్న సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్ సంస్థ కార్యాలయాన్ని వాచ్‌టెల్ ప్రతినిధులు సందర్శించినట్లు తెలుస్తోంది. సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్ సంస్థ చైర్మన్ అయిన సిరిల్ ష్రోఫ్ కుమార్తెనే గౌలమ్ అదానీ కుమారుడు వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక వెల్లడైన దరిమిలా అదానీ గ్రూపు దాదాపు 100 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఇప్పటివరకు చవిచూసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News