Monday, December 23, 2024

తగ్గేదేలే..

- Advertisement -
- Advertisement -

 విధ్వంసానికి పాల్పడిన వారిని సైన్యంలోకి తీసుకోం
 సైన్యంలో సగటు వయస్సు తగ్గించేందుకే సంస్కరణలు
 అగ్నివీరులు సైన్యంలో కొనసాగే అవకాశాలు
అలవెన్సుల విషయంలో తేడా లేదు
ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం
ఈవారంలోనే నోటిఫికేషన్లు..
వారంలో రిక్రూట్‌మెంట్లు స్పష్టం చేసిన త్రివిధ బలగాల ప్రతినిధులు

న్యూఢిల్లీ: సైన్యంలోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేకించి ఇప్పటివరకూ సైన్యంలో ఉన్న సగటు వయో పరిణామం 30 సంవత్సరాలను గణనలోకి తీసుకునే అగ్నిపథ్ నియామక ప్రక్రియ చేపట్టినట్లు భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆదివారం సైనిక, నౌక, వాయుసేనల అత్యున్నత స్థాయి అధికారులు మీడియాతో మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. ముందుగా అగ్నివీరులు అయ్యే ఆమె లేదా అతడు ఘర్షణలకు దిగలేదని, విధ్వంసాలతో తమకు సంబంధం లేదని తెలియచేసే ప్రమాణ పత్రం సమర్పించుకోవల్సి ఉంటుందని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను పోలీసు వెరిఫికేషన్లకు పంపిస్తారు. తరువాతనే అన్ని సక్రమంగా ఉంటేనే వారిని అగ్నివీరులుగా తీసుకునే క్రమానికి ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. సైన్యం అంటేనే క్రమశిక్షణకు ప్రతిరూపంగా ఉంటుంది. అవాంఛనీయ ఘటనలకు దిగిన వారిని ఆ ఆలోచనలకు పాల్పడే వారిని ముందుగానే నిరాకరిస్తామన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు అయి ఉంటే వారికి తిరస్కరణనే అన్నారు. సైన్యంలో సగటు వయస్సు ప్రమాణం 30 ఏళ్లు దాటి ఉంటోంది. దీనిని నివారించేందుకు యువరూపం మరింతగా సంతరించుకునేందుకు ఈ పథకం తీసుకువచ్చారని వివరించారు. అగ్నిపథ్‌ను వెనకకు తీసుకునే ఆలోచనలేదు. రాదని తెలిపారు. రెండు మూడేళ్లుగా సైన్యంలో వివిధ కారణాలతో రిక్రూట్‌మెంట్లు లేవని, పైగా అధునాతన సైనిక సాయుధ సంపత్తికి దారి ఏర్పడుతోందని, ఈ దశలో వినియోగసామర్థం వీలు కల్పించుకునేందుకు యువతకు అత్యధికంగా తీసుకునేందుకు ఏకంగా 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వారికి ప్రాధాన్యత ఇస్తూ అగ్నివీరులుగా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. వీరికి సైన్యంలో నాలుగు సంవత్సరాలు త్రివిధ సైనిక దళాల్లోకి వీరిని తీసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంపై ఏర్పాటు అయిన కమిటీ నివేదికను ప్రాతిపదికలోకి తీసుకుని ఇప్పుడు సంస్కరణల అనివార్యతను బట్టి దీనిని తీసుకురావడం జరిగిందన్నారు. అగ్నివీరుల పథకంలో చేరే వారికి పలు రాయితీలను ఇప్పటి నిరసనల కారణంగా కేంద్రం ప్రకటించించలేదని, ఇంతకు ముందే వీటిపై పరిశీలన జరిగిందని ఇప్పుడు ప్రకటన వెలువరించారని కేంద్రం నిరసనలకు తలొగ్గలేదని పరోక్షంగా తెలిపారు. సుదీర్ఘ కరోనా దశ, తరువాతి లాక్‌డౌన్ల దశలో కేంద్రం సైన్యంలోకి భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ల కోసం ఈ అగ్నిపథ్‌ను తీసుకువచ్చిందని వివరించారు. అగ్నిపథ్‌ను అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం వేరే లేదని, ఎక్కువగా చిక్కులు లేకుండా దీనిని తీసుకువచ్చే సమయం ఇదే అన్నారు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించాం, సైనిక శక్తిని యువపాటవం చేసే దిశలో చివరికి విదేశీ సైనిక స్వరూపాన్ని విశ్లేషించడం జరిగింది. యువత కష్టాలు సవాళ్లను ఎదుర్కొనే ధీమా స్థయిర్యంతో ఉంటుంది. సెల్‌ఫోన్లు డ్రోన్లతో యువత అద్భుతాలకు దిగే వీలుంది. వారికి టెక్నాలజి పట్ల ఉండే అవగావహన ఆలోచనలతో సైనిక శక్తికి మరింత పాటవం తీసుకురావచ్చునని పూరి స్పష్టం చేశారు. వారికి జోష్ ఉంటుంది. హోష్ ఉంటుంది. ఏదో సాధించాలనే తపన ఉంటుంది. అసంఖ్యాక భారతీయ యువతను ఇందుకు వాడుకునేందుకు దీనిని సిద్ధం చేశామని తెలిపారు.
అగ్నిపథ్ పాలసీ అత్యవసరం: త్రివిధ బలగాల ప్రతినిధులు
అగ్నిపథ్‌పై ఎటువంటి అపోహలు అవసరం లేదని త్రివిధ బలగాల అధికార ప్రతినిధులు తెలిపారు. పలు విధాలుగా పరిశీలన జరిపిన తరువాతనే సరికొత్త సైనిక రిక్రూట్‌మెంట్ల పద్ధతి వచ్చింది. సాయుధ బలగాలలోకి భారీ సంఖ్యలో యువత చేరాలనేదే సంకల్పం అని వివరించారు. సైన్యం సామూహిక జనశక్తి కావాలనేదే ఆలోచన అన్నారు. ఇప్పుడు సైన్యంలో అత్యధిక సంఖ్యలో 30 సంవత్సరాలు పైబడ్డ వారే ఉన్నారని ఇది ఆందోళనకల్గించే విషయం అని అనిల్ పూరి తెలిపారు. అగ్నిపథ్ వెనకకు వెళ్లేది లేదన్నారు. ఇది ఎందుకు ఉపసంహరించుకోవాలని ప్రశ్నించారు.
ఈ వారంలోనే నోటిఫికేషన్లు
ఆగస్టులో రిక్రూట్‌మెంట్లు
అగ్నిపథ్ ద్వారా సైనిక నియామకాల ప్రక్రియ తొలి దశ ఈ వారం నుంచి ఆరంభం అవుతుంది. ముందుగా వివిధ బలగాలలో అగ్నివీరులను తీసుకునే అధికారిక నోటిఫికేషన్లు వేర్వేరుగా వెలువడుతాయి. ఆగస్టు ప్రధమార్థంలో రిక్రూట్‌మెంట్లు ఉంటాయి. ఇందుకు తగు ర్యాలీలు అంటే అభ్యర్థుల మానసిక శారీరక ధారుఢ్యం ఇతర అంశాలు చేపడుతారని లెఫ్టినెంట్ జనరల్ సి బన్సి పొన్నప్ప తెలిపారు. అగ్నివీరు తొలి బ్యాచ్ డిసెంబర్ మొదటివారంలో ఏర్పాటు అవుతుంది. రెండో లాట్ ఫిబ్రవరిలో ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి యువత పాల్గొనేలా చేసేలా మొత్తం మీద 83 రిక్రూట్‌మెంట్ ర్యాలీలు ఉంటాయని వివరించారు. ఇక నౌక దళంలో తొలి అగ్నివీరుల దళం ఐఎన్‌ఎన్ చిల్కాకు చేరుకుని ఒడిషాలో నవంబర్ 21 నాటికి శిక్షణ పొందుతుంది. ఇక ఎయిర్‌ఫోర్స్‌లో తొలి బ్యాచ్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి సిద్ధం అవుతుంది. ఈ నెలలోనే వారికి శిక్షణ ఆరంభం అవుతుంది.
అగ్నివీరులకు రూ కోటి పరిహారం
అగ్నివీరులుగా చేరే వారు అవాంఛనీయ స్థితిలో ఘర్షణల దశల్లో వీర మరణం పొందితే వారికి రూ కోటి పరిహారం అందుతుంది. ఇక నాలుగేళ్ల పదవీ తరువాత వారికి పలు రకాల లాభాలతో పాతిక లక్షల వరకూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందని కేంద్రం తెలిపింది. వివిధ సాంకేతిక అంశాలలో తర్ఫీదును ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సైనికులుగా విరమించుకునే వారు ఆ తరువాత వేరే వృత్తులలో స్థిరపడేందుకు అవకాశాలు కల్పిస్తారు.

Top Defence Officials press meet over Agneepath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News