Monday, December 23, 2024

సూర్యకుమార్‌పై ఐసిసి ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

'Top-Gun' Like Poster For Suryakumar Yadav

దుబాయి : టీమిండియా యువ బ్యాటర్ సూర్యకుమార్‌పై ఐసిసి ఓ ఆసక్తిర పోస్టర్‌ను విడుదల చేసింది. ఇటీవలె ముగిసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్‌లలో డ్యాషింగ్ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యకుమా టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లలోనూ అర్ధ శతకాలతో రాణించాడు. అంతేకాదు ఇటీవలె విడుదలైన టి20 ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ను హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ‘టాప్‌గన్’తో పోలుస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. “ఎస్‌కెవై.. ఆకశమే నీకు హద్దు” అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్టర్‌లో టామ్‌క్రూజ్‌కు బదులు సూర్యకుమార్‌ను ఉంచింది. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో 40 వేలకుపైగా లైక్‌లతో.. దాదాపు 3 వేలకుపైగా రీట్వీట్లతో చెక్కర్లు కొడుతోంది. అయితే ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 15 పరుగులే చేసి అభిమానులను నిరాశకు గురిచేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News