- Advertisement -
తిరుపతి: తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టిటిడి చైర్మన్ భూమన అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూమన మాట్లాడారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడకదారిలో పిల్లలకు అనుమతి ఉంటుందని టిటిడి చైర్మన్ వివరించారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత పిల్లలను అనుమతించమని, భక్తుల భద్రతకు ఫారెస్ట్ సిబ్బందిని సక్యూరిటీగా నియమిస్తామని, కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి చేతి కర్ర ఇస్తామని, భద్రత కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి చైర్మన్ సూచించారు. వన్యప్రాణులకు భక్తులు ఆహారం పెట్టకూడదని చెప్పారు.
Also Read: వ్యవసాయం పండుగలా మారింది: వేముల
- Advertisement -