Monday, December 23, 2024

ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు టాప్ ప్రియారిటీ : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి ఆరాధన, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వీకెండ్‌లో ప్రకృతి రమణీయతను ప్రతిబింబించే వివిధ రకాల పక్షుల విన్యాసాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారు. భవిష్యత్ తరాల మను గడలో పర్యావరణ పరిరక్షణ కీలకమని ఆయన చెబుతుంటారు. అందుకు అనుగుణంగా గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిస్తూ వస్తున్నారు.

మరోవైపు ప్రకృతి రమణీయతను సైతం ఆయన ఆస్వాదిస్తుంటారు. ఇందుకోసం ప్రతి వీకెండ్‌లో ఆయన విభిన్న ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడ ప్రకృతి అందాలకు వన్నె తెచ్చే విధంగా ఉండే వివిధ పక్షుల అపురూపమైన దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తారు. అంతేకాదు, తాను తీసిన ఫోటోలను తన ట్విట్టర్‌లో ఆయన పొందుపరుస్తుంటారు. ఈ విధంగా ఆయన ఎప్పటికప్పుడు ప్రకృతి అందాలు, పర్యావరణ పరిరక్షణకు టాప్ ప్రియారిటీ ఇస్తుంటారు.

Scene 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News