Monday, December 23, 2024

ప్రపంచంలో టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన 10 నగరాల జాబితాను హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేకపోవడం విశేషం. అయితే..సంపద విషయానికి వస్తే ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న నగరాలలో బెంగళూరు కూడా ఉంది. 10 సంపన్న నగరాల జాబితాలో అమెరికా, చైనా దేశాలు అధిక ప్రాధాన్యం దక్కించుకున్నాయి.

Also Read: గణితం రాకపోతే పోటీలో లేనట్లే.. మ్యాథ్స్ తప్పనిసరి చేస్తూ నిబంధన

టాప్ 10 సంపన్న నగరాల జాబితాలో మొదటి స్థానం న్యూయార్క్(అమెరికా)కు దక్కింది. రెండవ స్థానంలో టోకో(జపాన్), తృతీయ స్థానంలో ది బే ఏరియా(అమెరికా), నాలుగవ స్థానంలో లండన్(బ్రిటన్) ఉన్నాయి. ఐదవ స్థానంలో సింగపూర్, ఆరవ స్థానంలో లాస్ ఏంజెలెస్(అమెరికా), ఏడవ స్థానంలో హాంకాంగ్(చైనా అధీనంలోని ప్రత్యేక పాలనా ప్రాంతం), ఎనిమిదవ స్థానంలో బీజింగ్(చైనా) ఉన్నాయి. 9వ స్థానంలో షాంఘై(చైనా), 10వ స్థానంలో సిడ్నీ(ఆస్ట్రేలియా) ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగా న్యూయార్క్ నిలిచింది. ఈ నగరంలో 3.4 లక్షల మంది మిలియనీర్లు, 724 సెంటీ మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికాకు ఆర్థిక రాజధానిగా పేరుపొందిన న్యూయార్క్‌లో ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఎన్‌వైఎస్‌ఇ, నాస్‌డాగ్ ఉన్నాయి.

ఇక రెండవ సంపన్న నగరమైన టోక్యో విషయానికి వస్తే 2,60.309 మంది మిలియనీర్లు ఉన్నారు, 250 మంది సెంటీ మిలియనీర్లు, 14 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆసియాలో అత్యంత సంపన్న నగరంగా టోక్యో పేరు సంపాదించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News